రాజమండ్రిలో కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడు క్షేమం..
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:10 PM
రాజమండ్రిలోని అనపర్తిలో కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని రక్షించిన పోలీసులు.. తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు.
రాజమండ్రి, అక్టోబర్ 13: రాజమండ్రిలోని అనపర్తిలో కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడి కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి బాలుడిని రక్షించిన పోలీసులు.. తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. గత నెల 23వ తేదీన ఐదేళ్ల బాలుడు కృష్ణ కిడ్నాప్‌కు గురయ్యాడు. తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో బాలుడిని నిందితులు కిడ్నాప్ చేశారు. కృష్ణ కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడు కిడ్నాప్‌కు గురైనట్లు గుర్తించిన పోలీసులు.. చిన్నారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. కిడ్నాప్ అయిన 15 రోజుల తర్వాత బాలుడిని పోలీసులు రక్షించారు.
కిడ్నాప్‌కు సంబంధించిన వివారలను రాజమండ్రి ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య మీడియాకు తెలియజేశారు. కిడ్నాప్ చేసిన బాలుడిని హైదరాబాద్‌కు తరలించి అమ్ముకోవడానికి నిందితులు కుట్ర పన్నినట్లు తెలిపారు. పిఠాపురంలో బాలుడిని గుర్తించిన ప్రత్యేక పోలీస్ బృందాలు.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ద్వారపూడి, పిఠాపురానికి చెందిన ఇందుమల్లి కుమారి, మోర్త నాగార్జున, రౌడీషీటర్ ఏడిద విజయ్ కుమార్‌ను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సాంకేతికత ఆధారంగా ఈ కేసును అనపర్తి పోలీసులు ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం: గొట్టిపాటి
Read Latest AP News And Telugu News