Share News

రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:51 AM

ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ‘చౌకీదార్ చోర్ హై’ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించింది.

రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే

ఇంటర్నెట్ డెస్క్: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన ‘చౌకీదార్‌ చోర్‌ హై’ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో ట్రయల్‌ కోర్టు విచారణపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసులో రాహుల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి 4 వారాల గడువు విధిస్తూ.. నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


కాగా.. 2018లో రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంపై జరిగిన రాజకీయ వివాదం నేపథ్యంలో రాజస్థాన్‌లో నిర్వహించిన ర్యాలీలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేత మహేశ్‌ శ్రీశ్రీమల్‌ పరువు నష్టం దావా వేశారు. ఈ పిటిషన్‌పై ముంబైలోని గిర్గావ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 2019లో విచారణ చేపట్టింది. అయితే.. ఆ కేసును కొట్టివేయాలంటూ రాహుల్‌ పిటిషన్ దాఖలు చేయగా.. దానిని బాంబే హైకోర్టు ఇటీవల తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ట్రయల్‌ కోర్టు విచారణపై స్టే విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.


ఇవీ చదవండి:

జంతర్ మంతర్‌లో మొదలైన నిరసన.. పోలీసుల అదుపులో సీజేపీ నేతలు

బ్యాట్‌మన్ మాస్కులతో రాహుల్ గాంధీ.. ఢిల్లీలో కాంగ్రెస్ వినూత్న ప్రచారం

Updated Date - Oct 13 , 2026 | 12:00 PM