Share News

బ్యాట్‌మన్ మాస్కులతో రాహుల్ గాంధీ.. ఢిల్లీలో కాంగ్రెస్ వినూత్న ప్రచారం

ABN , Publish Date - Oct 12 , 2026 | 08:02 PM

ఢిల్లీలో యూత్ కాంగ్రెస్‌ నేతలు పంపిణీ చేసిన ఈ మాస్కులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాహుల్ మాస్క్ ధరింపజేయడం మరింత ఆసక్తికరంగా మారింది.

బ్యాట్‌మన్ మాస్కులతో రాహుల్ గాంధీ.. ఢిల్లీలో కాంగ్రెస్ వినూత్న ప్రచారం

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా గోతమ్‌ సిటీని కాపాడే సూపర్‌హీరో బ్యాట్‌మన్‌ గురించి ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలంటూ ఇండియా కూటమి చేపట్టిన ‘ఛలో ఢిల్లీ’ మార్చ్‌లో బ్యాట్‌మన్‌ మాస్కులు ప్రత్యేకాకర్షణగా నిలవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో యూత్ కాంగ్రెస్‌ నేతలు పంపిణీ చేసిన ఈ మాస్కులను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాహుల్ మాస్క్ ధరింపజేయడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పోస్టులను ఎన్ఎస్‌యూఐ ఎక్స్‌లో షేర్ చేసింది.

Rahul Gandhi with Mallikarjun Kharge.webp


రాహుల్‌ను అన్యాయంపై పోరాడే వ్యక్తిగా చూపే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్‌ సోషల్ మీడియాలో బ్యాట్‌మన్‌ వేషాలను విస్తృతంగా వినియోగిస్తోంది. గతంలో రాహుల్‌ను బ్యాట్‌మన్‌తో పోలుస్తూ కాంగ్రెస్‌ 13 సెకన్ల వీడియోను విడుదల చేసింది. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు జరిగిన ప్రతిపక్షాల మార్చ్‌లో రాహుల్‌ బారికేడ్లపై నిల్చున్న దృశ్యాలను.. గోతమ్‌ నగరంలోని ఓ భవనంపై నిలబడిన బ్యాట్‌మన్‌తో జోడించి పోస్ట్ చేసింది. ఇన్‌స్టాలో 'మీరు బ్యాట్‌మనా?' అని కాంగ్రెసన్ అగ్రనేతను అడగ్గా.. 'నేనూ, బ్యాట్‌మన్‌ ఒకే గదిలో ఉన్నట్లు ఎవరూ ఎప్పుడూ చూడలేదు' అని ఛలోక్తులు విసిరారు.


కాగా.. గత ఆగస్టులో కూడా ఢిల్లీలోని కాంగ్రెస్‌ కార్యాలయం వద్ద రాహుల్‌ను రియల్ లైఫ్ బ్యాట్‌మన్‌గా అభివర్ణిస్తూ పోస్టర్లు వెలిశాయి. 'సైలెంట్ గార్డియన్', 'ఎ వాచ్‌ఫుల్ ప్రొటెక్టర్' లాంటి నినాదాలతో రాహుల్‌, బ్యాట్‌మన్‌ చిత్రాలను పక్కపక్కనే ఉంచారు. తాజా మార్చ్‌లోనూ ఈ మాస్కుల సందడి ప్రచారానికి మరింత ఊపునిచ్చింది.

Rahul with Batman mask.webp


ఇవీ చదవండి:

ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం

సుప్రీం కోర్టును రాజకీయాల్లోకి లాగాలని చూడొద్దు: సీజేఐ

Updated Date - Oct 12 , 2026 | 08:22 PM