Share News

సుప్రీం కోర్టును రాజకీయాల్లోకి లాగాలని చూడొద్దు: సీజేఐ

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:55 PM

'ఓట్ల చోరీ' అంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కు వినతి పత్రం సమర్పించేందుకు సోమవారం సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు సీజేఐను అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్ తిరష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.

సుప్రీం కోర్టును రాజకీయాల్లోకి లాగాలని చూడొద్దు: సీజేఐ
CJI Surya Kant

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఓట్ల చోరీ అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు వినతి పత్రం సమర్పించేందుకు సోమవారం సమయం ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు సీజేఐను అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిని జస్టిస్ సూర్యకాంత్ తిరష్కరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై సీజేఐ స్పందించారు. ఇండి కూటమి (Opposition parties) నుంచి తనకు వచ్చిన అభ్యర్థనపై ఆదివారం రాత్రి కాంగ్రెస్‌ కీలక నేతలు ఖర్గే, రాహుల్‌ గాంధీలకు మెయిల్‌ పంపినట్లు వెల్లడించారు.


కేంద్ర ప్రధాన ఎన్నికల సంఘం విషయంలో వారు లేవనెత్తాలనుకున్న సమస్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. విచారణలో ఉన్న అంశాలపై సమావేశం కావడం అధికారాల విభజన సూత్రానికి విరుద్ధమని సీజేఐ తెలిపారు. కోర్డులో పెండింగ్‌లో ఉన్న అంశాలపై రాజకీయ నేతలతో సమావేశం కావాల్సిన అవసరం లేదని భావించి, వారికి అపాయింట్‌మెంట్‌ నిరాకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాలనకు సంబంధించిన విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోబోవని.. కావాలంటే కాంగ్రెస్‌ నేతలు ఈ విషయంపై పిటిషన్‌ ద్వారానే తమను సంప్రదించవచ్చని సీజేఐ సూచించారు. సీఈసీ అంశాలకు సంబంధించిన విషయాలు రేపు(మంగళవారం) విచారణకు రానున్నాయని కూడా ఆయన పేర్కొన్నారు.


సుప్రీం కోర్టు తలుపులు ఎల్లప్పుడూ అందరి కోసం తెరిచే ఉంటాయన్నారు. అంతే కానీ కోర్టులను రాజకీయాల్లోకి లాగాలని చూడొద్దని ప్రతిపక్షాలకు సూచించారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సందర్భంలో సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమావేశంలో ‘నీరు-జీవన అమృతం’ అనే అంశంపై సీజేఐ మాట్లాడుతూ.. కలుషిత జలాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దానివల్ల ప్రజల ఆరోగ్యాలకు భారీ ముప్పు పొంచి ఉందన్నారు.


ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్

ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం

మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు

Updated Date - Oct 12 , 2026 | 03:59 PM