Share News

మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:02 PM

ఢిల్లీ మెట్రోరైల్‌లో ప్యాసింజర్ మృతి చెందిన ఘటనలో మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్, ఆయన తనయుడు సిద్ధార్థ సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు
Delhi Metro Passenger Death

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీ మెట్రోరైల్‌లో రెండు రోజుల క్రితం ప్యాసింజర్ మృతి చెందిన ఘటనలో మాజీ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్, ఆయన తనయుడు సిద్ధార్థ సింగ్‌ను పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. సీటు విషయంలో తగాదా తలెత్తిన సమయంలో పవన్ కుమార్‌పై ప్రతాప్ సింగ్, సిద్ధార్థ సింగ్‌ చేయిచేసుకున్నట్టు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ క్రమంలో కిందపడ్డ పవన్ శర్మ మృతి చెందినట్టు చెప్పారు.


జాతీయ మీడియా కథనాల ప్రకారం, సీనియర్ సిటిజన్ల కోసం రిజర్వ్ చేసిన సీటు విషయంలో వారి మధ్య తగాదా మొదలైంది. ఈ క్రమంలో ప్రతాప్ సింగ్, సిద్ధార్థ్ సింగ్ తోయడంతో కిందపడిపోయిన పవన్ శర్మ తలకు గాయమైంది. వెంటనే మెట్రో సిబ్బంది ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. పవన్ శర్మ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రతాప్, సిద్ధార్థలను అరెస్టు చేశారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఓ అవినీతి కేసులో ప్రతాప్ సింగ్‌ను సీబీఐ అధికారులు గతంలో ఓసారి అరెస్టు చేసినట్టు తెలిసింది. ఇక సిద్ధార్థ సింగ్ సుప్రీంకోర్టులో లాయర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం


ఈ వార్తలనూ చదవండి:

ఔషధాల్లాగా ఏఐనీ నియంత్రించాలి: బిల్ గేట్స్

చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం

Updated Date - Oct 12 , 2026 | 02:08 PM