ఔషధాల్లాగా ఏఐనీ నియంత్రించాలి: బిల్ గేట్స్
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:14 AM
ఏఐ నియంత్రణపై బిల్ గేట్స్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఔషధాల్లాగానే ఏఐపై కూడా తప్పనిసరిగా నియంత్రణ ఉండాలని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏఐపై నియంత్రణ తప్పనిసరి అని వాదిస్తున్న టెక్ దిగ్గజాల్లో మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ముందువరుసలో ఉంటారు. తాజాగా ఆయన మరోసారి తన ఆందోళనను నెట్టింట పంచుకున్నారు. ఔషధాలు, విమానాలను నియంత్రించిన తీరులోనే ఏఐని కూడా కంట్రోల్ చేయాలని స్పష్టం చేశారు. ‘మనం విమానాలు, కార్లు, ఔషధాలకు సంబంధించిన అంశాలను నియంత్రిస్తున్నాము. అదే విధంగా ఏఐపై నియంత్రణ అవసరం. ఏఐ సామర్థ్యాలను సద్వినియోగం చేసుకుంటూ ముప్పును తగ్గించేలా నియంత్రణలు ఉండాలి’ అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
ఏఐపై నియంత్రణతో ముప్పు అంతా తొలగిపోతుందని తాను చెప్పట్లేదని గేట్స్ వివరించారు. అయితే, దుర్మాగుల చేతుల్లో ఈ సాంకేతికత వెళ్లకుండా అడ్డుకోవచ్చని అన్నారు. ఏఐపై నియంత్రణ కోసం ప్రపంచం కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. ‘ఈ విషయంలో మనం చేరుకోవాల్సిన స్థితికి చేరుకోలేదు. ఈ అంశంపై కచ్చితంగా మరింత దృష్టి పెట్టాలి’ అని చెప్పారు.
ఇటీవల కాలంలో అనేక మంది పరిశోధకులు ఏఐపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. మానవాళి అంతం అయిపోవచ్చని ఏఐ పరిశోధకుడు జేకబ్ కాక్సన్ హెచ్చరించారు. ‘ఏఐ చాలా శక్తిమంతమైనది. కోట్ల మంది మరణాలకు దారి తీసే పరిస్థితులను సృష్టించవచ్చు’ అని బిల్ గేట్స్ గత నెలలో కామెంట్ చేశారు. ఓపెన్ ఏఐ, ఆంథ్రోపిక్ సంస్థలు కూడా ఏఐపై గట్టి నియంత్రణల కోసం పట్టుబడుతున్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం
ఏఐను తట్టుకునేవి ఈ మూడు వర్గాలే.. మెటా మాజీ అధికారి ఏం చెప్పారంటే..