Share News

చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం

ABN , Publish Date - Oct 09 , 2026 | 08:46 AM

చాట్‌జీపీటీ సాయంతో ఉక్రెయిన్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న కొన్ని రష్య, అకౌంట్స్‌పై నిషేధం విధించామని ఓపెన్ ఏఐ గురువారం తెలిపింది. ఇరానియన్ అకౌంట్స్‌ను కూడా నిషేధించామని చెప్పింది

చాట్‌జీపీటీతో తప్పుడు ప్రచారం.. రష్యా, ఇరాన్ అకౌంట్స్‌పై ఓపెన్ ఏఐ నిషేధం
Fake Propaganda with ChatGPT accounts

ఇంటర్నెట్ డెస్క్: చాట్‌జీపీటీ సాయంతో ఉక్రెయిన్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్న కొన్ని రష్య, ఇరానియన్ అకౌంట్స్‌పై నిషేధం విధించామని ఓపెన్ ఏఐ గురువారం తెలిపింది. ఈ అకౌంట్స్ సాయంతో కొందరు మేధోమధన సంస్థలను, ఫేక్ జర్నలిస్టు ప్రొఫైల్స్‌ను సృష్టించి జనాల్ని ప్రభావితం చేస్తున్నారని పేర్కొంది. దీంతో, ఏఐ సామర్థ్యాలపై చర్య మొదలైంది. ఏఐతో జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉందని పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు.


రష్యా, ఇరాన్‌లకు చెందిన పలు అకౌంట్స్‌పై నిషేధం విధించామని ఓపెన్ ఏఐ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఘర్షణలకు సంబంధించి ఈ అకౌంట్స్ సాయంతో తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించామని సంస్థ తెలిపింది.

చాట్‌జీపీటీ సాయంతో ఇరాన్‌లో ఫేక్ జర్నలిస్టు ప్రొఫైల్స్‌ను సృష్టించారని ఓపెన్ ఏఐ పేర్కొంది. ఈ ప్రొఫైల్స్‌తో తప్పుడు వార్తాకథనాలను వండి వార్చి రకరకాల మీడియా సంస్థల్లో ప్రచురితమయ్యేలా చేశారని పేర్కొంది. ఇలాంటి 100 ఆర్టికల్స్‌ను గుర్తించామని చెప్పింది. చిన్న మధ్యశ్రేణి పత్రికల్లో ఈ వ్యాసాలు వచ్చాయని తెలిపింది. యూఎస్-ఇరాన్ వార్ అప్‌డేట్స్ పేరిట కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌ను కూడా సృష్టించారని వెల్లడించింది.


ఈ వార్తలనూ చదవండి:

ఏఐను తట్టుకునేవి ఈ మూడు వర్గాలే.. మెటా మాజీ అధికారి ఏం చెప్పారంటే..

ఫేస్‌బుక్‌లో కొత్త ఇంటర్‌‌ఫేస్.. ఇకపై యాప్ తెరవగానే షార్ట్ వీడియోలు

Updated Date - Oct 09 , 2026 | 09:13 AM