Home » CJI
తన కుమార్తెలు ప్రియాంక, మహిలకు ప్రతి రోజూ రెస్పిరేటరీ, న్యూరోలాజికల్ నుంచి ఆక్యుపేషనల్ థెరపీ, పెయిన్ మేనేజిమెంట్ వరకూ వివిధ తరహాల్లో ఎక్స్ర్సైజ్ అవసరమవుతుందని మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న నివాసంతో బాత్రూంలతో సహా అన్నింటిని వారి అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయడం జరిగిందని వివరించారు.
సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ చంద్రచూడ్ను వెంటనే ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసం నుంచి ఖాళీ చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు పాలనా విభాగం కోరింది.
రాజ్యాంగమే సర్వోన్నతమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ అన్నారు. ప్రజాస్వామ్యంలోని మూడు విభాగాలైన న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థలు దాని కిందే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Justice Gavai oath ceremony: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ బుధవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు హాజరయ్యారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవీ విరమణ అనంతరం ఎలాంటి అధికారిక పదవులు చేపట్టబోనని స్పష్టం చేశారు. ఆయన న్యాయరంగానికి సేవలను కొనసాగిస్తానని చెప్పారు, తదుపరి సీజేఐ జస్టిస్ గవాయ్ మద్దతుతో తన సర్వసాధారణ సేవలను కొనసాగిస్తానని వెల్లడించారు.
జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆయనకు మంగళవారం ఉదయం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. సీజేఐగా ఖన్నా పనితీరును బార్ సీనియర్ లాయర్లు ఈ సందర్భంగా ప్రశంసించారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో డబ్బు కట్టలు కనిపించిన విషయం సుప్రీంకోర్టు కమిటీకి నిర్ధారణైంది. ఆయనపై అభిశంసన జరపాలని సీజే జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985లో న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు.
భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని అశోకా హాల్లో ద్రౌపది ముర్ము, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో ప్రమాణం చేయించారు.
2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులైనప్పుడు.. మొదటి రోజున మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా గతంలో సేవలు అందించిన కోర్టు రూంలోనే విధులు నిర్వర్తించారు.