Share News

New CJI: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:43 PM

హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10 జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం తదితర కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు.

New CJI: తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్
New CJI justice Surya kant

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొత్త ప్రధాన నాయమూర్తి (CJI)గా జస్టిస్ సూర్యకాంత్ (Surya Kant) నియామకం కానున్నారు. ఆయన పేరును సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ (BR Gavai) కేంద్రానికి సిఫారసు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ పేరును ఒక లేఖలో కేంద్ర న్యాయశాఖ మంత్రికి ఆయన తెలియజేశారు. గవాయ్ వారసుడి ఎన్నిక ప్రక్రియను కేంద్ర ఇటీవల ప్రారంభించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.


నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిని సీజేఐ పదవికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ కాంత్ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నారు. గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో దేశ 53వ సీజేఐగా జస్టిస్ కాంత్ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో ఉంటారు.


జస్టిస్ సూర్యకాంత్ ఎవరు?

హర్యానాలోని హిస్సార్‌లో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు. ఎన్నికల జవాబుదారీతనంపై తన నిబద్ధతను చాటుకుంటూ బిహార్ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ను ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని చారిత్రక ఆదేశాలు సైతం ఇచ్చారు. 2022లో ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. రక్షణ బలగాలకు ఓఆర్ఓపీ స్కీమ్‌ను సైతం ఆయన ధ్రువీకరించారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన: CBI దర్యాప్తు అవకాశం

వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు...

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 04:03 PM