Share News

Digital Arrests: డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన: CBI దర్యాప్తు అవకాశం

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:10 PM

దేశవ్యాప్తంగా పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మోసాల్లో డిజిటల్ కేటుగాళ్లు.. పోలీసు, CBI, ED అధికారులుగా తమను ప్రదర్శించుకుని, తప్పుడు కోర్టు ఆదేశాలు చూపించి..

 Digital Arrests: డిజిటల్ అరెస్ట్ మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన: CBI దర్యాప్తు అవకాశం
Supreme Court India, digital arrest frauds

ఢిల్లీ, అక్టోబర్ 27: దేశవ్యాప్తంగా పెరుగుతున్న 'డిజిటల్ అరెస్ట్' మోసాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మోసాల్లో డిజిటల్ కేటుగాళ్లు.. తమను తాము పోలీసు, CBI, ED అధికారులుగా ప్రదర్శించుకుని, తప్పుడు కోర్టు ఆదేశాలు చూపించి అమాయకుల నుంచి డబ్బు దోచేస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్‌లు 'సిస్టమ్‌లో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి' అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సుమోటోగా కేసును విచారణకు తీసుకున్న జస్టిస్ సూర్య కాంత్, జయమల్య బాగ్చీలతో కూడిన బెంచ్, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.


ఈ మోసాలకు సంబంధించి తమ పరిధిలో నమోదైన FIRల వివరాలు, దర్యాప్తు పురోగతి, ఫిర్యాదుల సంఖ్య వంటి సమాచారాన్ని అందించాలని కోర్టు రాష్ట్రాల్నీ, యూటీలను ఆదేశించింది. నవంబర్ 3న మరోసారి విచారణ జరుపుతామని చెప్పింది. ఈ అంశం మీద CBI దర్యాప్తు చేపట్టాలా, లేదా? అనే అంశంపై కోర్టు నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ క్రైమ్‌లు పాన్-ఇండియా స్థాయిలో, అంతర్జాతీయ లింకులతో (మయన్మార్, థాయ్‌లాండ్ నుంచి) జరుగుతున్నాయని గుర్తించి, అన్ని కేసులను CBIకు అప్పగించే అవకాశం ఉందని సూచించింది.


CBIకు ఈ కేసులను డీల్ చేయడానికి అదనపు వనరులు, సైబర్ ఎక్స్‌పర్టులు అవసరమా? అని కూడా కోర్టు ప్రశ్నించింది. CBI ప్రతినిధి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కొన్ని కేసులపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ మోసాలు ప్రత్యేకించి సీనియర్ సిటిజన్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఉదాహరణకు హర్యానా అంబాలాలో ఒక వృద్ధ దంపతుల నుంచి రూ.1.05 కోట్లు మోసం చేసిన కేసు (సెప్టెంబర్ 2025) ఆధారంగా కోర్టు స్పందించింది.


ఇవీ చదవండి:

నవంబరు 1 నుంచి బ్యాంకుల్లో వచ్చే మార్పులివే..

హైదరాబాద్‌ యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ హబ్‌

కర్నూలు బస్సు ప్రమాదం.. బ్లూ మీడియాపై ప్రభుత్వం సీరియస్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2025 | 05:45 PM