Share News

Uttar Pradesh: చనిపోయిన కొడుకు.. తిరిగి వస్తాడని తండ్రి వింత పని!

ABN , Publish Date - Oct 27 , 2025 | 11:13 AM

చనిపోయిన తన కుమారుడు బతికి వస్తాడని ఓ తండ్రి వింత పని చేశాడు. మూడు రోజులపాటు శవానికి పూజలు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

Uttar Pradesh: చనిపోయిన కొడుకు.. తిరిగి వస్తాడని తండ్రి వింత పని!
Hatras incident

ఉత్తర్‌ప్రదేశ్, అక్టోబర్ 27: తల్లిదండ్రులకు బిడ్డలపై ఎంతో ప్రేమ ఉంటుంది. వారిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తారు. పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా అల్లాడి పోతుంటారు. ఇక ఏదైనా ప్రమాదం జరిగి తమ నుంచి బిడ్డ శాశ్వతంగా దూరమైతే తట్టుకోలేరు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. చనిపోయిన కుమారుడు బతికి వస్తాడని ఓ తండ్రి వింత పని చేశాడు. మూడు రోజులపాటు శవానికి పూజలు చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh news)లోని హత్రాస్ జిల్లా ఇటార్ని గ్రామానికి చెందిన నరేంద్ర తన కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ నెల 20వ తేదీన చిన్న కొడుకు కపిల్(12) ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే కపిల్ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇంతలో స్థానిక భూత వైద్యుడు పాము విషాన్ని బయటకు తీసి కపిల్‌ను(father rituals for son) బ్రతికించగలడని ఎవరో నరేంద్ర కుటుంబానికి చెప్పారు.


వారి మాటలు నమ్మిన నరేంద్ర.. కొడుకు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత స్థానిక భూత వైద్యుడిని పిలిచాడు. ఆ వ్యక్తి గ్రామానికి వచ్చి వివిధ పూజలు(black magic rituals) చేశాడు. కానీ ఫలితం లేకపోవడంతో మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, మరుసటి రోజు నరేంద్ర మరొక భూత వైద్యుడిని తీసుకువచ్చాడు. పూడ్చిపెట్టిన కపిల్ మృతదేహాన్ని బయటకు తీసి.. నాలుగు రోజుల పాటు వివిధ పూజలు చేయించాడు. వారి ప్రయత్నాలేవీ కూడా ఫలించలేదు. దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు(Uttar Pradesh police) మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలానే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


ఇవి కూడా చదవండి..

Modi Hails Kumram Bheem: కుమ్రం భీమ్‌ పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకం

Male Dolphins Wear Sea Sponge: నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలే..!

Updated Date - Oct 27 , 2025 | 03:31 PM