ఢిల్లీలో ఇండియా కూటమి నేతల పాదయాత్ర ప్రారంభం
ABN , Publish Date - Oct 12 , 2026 | 03:29 PM
దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహా పాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి ‘సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర’ పేరుతో వారు ఈ యాత్రను చేపట్టారు.
ఢిల్లీ, అక్టోబర్12: దేశ రాజధాని ఢిల్లీలోని సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి నేతల మహా పాదయాత్ర ప్రారంభమైంది. బారాఖంబా రోడ్డు నుంచి ‘సుప్రీంకోర్టు వరకు ప్రజాస్వామ్యం కోసం పాదయాత్ర’ పేరుతో వారు ఈ యాత్రను చేపట్టారు. ఎన్నికల్లో అక్రమాలు, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) తీరుకు వ్యతిరేకంగా ఈ పాదయాత్రను సోమవారం లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతోపాటు విపక్ష పార్టీల అగ్రనేతలు చేపట్టారు. అంతకుముందు కాన్‌స్టిట్యూషన్ క్లబ్ వద్దకు ఇండియా కూటమి ఎంపీలతోపాటు సీనియర్ నాయకులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ, సమాజ వాదీ పార్టీ, టీఎంసీ, శివసేన (యూబీటీ) నేతలు మండిపడ్డారు.
ఎంపీ రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఈ రోజు ఢిల్లీలో 'ఇండియా' కూటమి భారీ పాదయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం దీర్ఘకాలిక పోరాటానికి సిద్ధమైనట్లు ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్ వైఖరిని ప్రశ్నిస్తూ విపక్షాలు ఈ నిరసన వ్యూహాన్ని చేపట్టాయి. ప్రధాని మోదీ, అమిత్ షా ఆదేశాలతోనే ఢిల్లీ పోలీసులు తమ నిరసనలను అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా ఆరోపించారు.
ఈ పాదయాత్ర సందర్భంగా ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మరో వైపు ఇండియా కూటమి నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా, జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఇండియా కూటమి నేతలు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫారం-6 సవరణలను మేము ఆమోదించలేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
మెట్రో ప్రయాణికుడి మృతి.. మాజీ ఐఏఎస్ అధికారి అరెస్టు