ఫారం-6 సవరణలను మేము ఆమోదించలేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:59 PM
ఫారం-6 వివాదంలో సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. ఫారం-6 సవరణలను తాము ఎక్కడా ఆమోదించలేదని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫారం-6పై వివాదం రాజుకున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈరోజు (సోమవారం) కీలక వ్యాఖ్యలు చేసింది. ఫారం-6 సవరణలను తాము ఎక్కడా ఆమోదించలేదని స్పష్టం చేసింది. ఈ సవరణలకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందని భారత ఎన్నికల సంఘం (ఈసీ) వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. బీహార్-సర్ తీర్పు సమయంలో అసలు కొత్త ఫారం-6 అందుబాటులోనే లేదని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. కొత్త ఫారం-6 డిక్లరేషన్‌కు సుప్రీంకోర్టు ఆమోదం ఉందంటూ ఎన్నికల సంఘం చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం తప్పుబట్టింది.
కాగా ఓటర్ల నమోదు ప్రక్రియలో ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుందంటూ పిటిషనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. చట్టబద్ధమైన నిబంధనలు సవరించకుండా ఫారం-6లో ఈసీ మార్పులు చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఫారం-6 సవరణలను తాము ఆమోదించలేదని తెలిపింది. ఫారంలో ఎవరు మార్పులు చేశారో రికార్డులు చూసి తేలుస్తామని చెప్పింది. రికార్డుల పరిశీలన అనంతరం ఫారం-6 మార్పులపై స్పష్టత ఇస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది.
ఈ వార్తలూ చదవండి
సుప్రీంకోర్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్..
ఢిల్లీలో నిరసనల వేళ.. సీజేఐ కీలక ఆదేశాలు