Share News

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్

ABN , Publish Date - Oct 12 , 2026 | 09:10 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరనవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ భరత్ దుర్గమ్మను దర్శించుకున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్
TDP Visakhapatnam MP Bharat

విజయవాడ, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరనవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు (సోమవారం) తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఎంపీ భరత్ (TDP Visakhapatnam MP Bharat) దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఎంపీకి అధికారులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి, వేదపండితులు ఆశీర్వచనం అందజేశారు.


ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడారు. దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతోమంది పేదలకు వైద్యం అందుతుందని వెల్లడించారు. ఇప్పుడు విజయవాడలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించి పేదలకు వైద్యం అందించేందుకు శ్రీకారం చుట్టామని ఉద్ఘాటించారు. నందమూరి బాలకృష్ణ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఎంపీ భరత్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయి: చిరంజీవి

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై జీవో 251 విడుదల

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 10:27 AM