Share News

ఏపీలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయి: చిరంజీవి

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:03 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రముఖ నటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పంచాయతీలు కూడా దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు.

ఏపీలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయి: చిరంజీవి
Chiranjeevi

కాకినాడ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పంచాయతీలు కూడా దేశంలోనే నంబర్‌వన్‌గా ఎదుగుతున్నాయని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రంలో అన్ని రంగాలు బాగుపడుతున్నాయని వివరించారు. ఈరోజు (ఆదివారం) తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురంలో చిరంజీవి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జీఎస్ఎల్ ఆస్పత్రి, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్‌ను మెగాస్టార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి ప్రసంగించారు.


చాలామంది క్యాన్సర్ ముదిరిపోయాక అప్రమత్తం అవుతున్నారు..

చాలామంది క్యాన్సర్ ముదిరిపోయాక అప్రమత్తం అవుతున్నారని.. కానీ ముందుగానే ప్రాథమికంగా ఈ వ్యాధిని గుర్తిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చిరంజీవి తెలిపారు. ముందుగా లక్షణాలు గుర్తిస్తే క్యాన్సర్ నుంచి బయటపడటం సులువేనని చెప్పుకొచ్చారు. తన భార్య, చెల్లెలు, అమ్మకు తరచూ క్యాన్సర్ పరీక్షలు చేయిస్తానని అన్నారు. మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నటుడు మురళీమోహన్ ఆరోగ్యాన్ని చూసి తాను కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని అన్నారు. ప్లాస్టిక్‌తో పర్యావరణానికి చాలా హాని ఉందని అన్నారు. గాజు గ్లాసు నీళ్లను తాను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానని చెప్పారు. అదే ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు తాగితే గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు.


కాగా, చిరంజీవికి మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనను చూసేందుకు అభిమానులు బారులు దీరారు. అభిమానులకు అభివాదం చేసుకుంటూ హెల్త్‌కేర్ సెంటర్‌కు చిరంజీవి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జీఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఛైర్మన్ గన్ని భాస్కరరావు, సూర్య ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జీవీబీ చౌదరి, పలువురు మంత్రులు, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

మంత్రి లోకేశ్ చొరవ.. ఆ పాఠశాలకు మహర్దశ

ఈ నెల 13న ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. ఎందుకంటే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 12:27 PM