Share News

ఏపీలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:54 PM

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులకు ఆమోదం లభించింది. గ్రామ సర్పంచులకు 27.95 శాతం, మున్సిపల్ ఛైర్మన్లకు 33.02 శాతం, మేయర్లకు 35.29 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇతర స్థానాలకు ప్రతిపాదించిన రిజర్వేషన్ల వివరాలు కూడా వెల్లడయ్యాయి.

ఏపీలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్
AP BC Reservations

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను ఆమోదించారు.


సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ...

కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వెల్లడించారు. డెడికేటెడ్ సిఫార్సుల మేరకు అర్బన్, రూరల్ ప్రాంతాలకు నిర్దేశించిన విధంగా యూనిట్ల వారీగా రిజర్వేషన్లను అమలు చేసేందుకు మంత్రిమండలి అంగీకరించిందని తెలిపారు. ఒక్క జెడ్పీ ఛైర్ పర్సన్లు మినహా మిగిలిన అన్ని పదవులకూ బీసీలకు 24 శాతానికి మించి రిజర్వేషన్లు వర్తింప చేసేలా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులను చేసినట్లుగా వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ... నిబంధనలను పాటిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మేలు చేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తామని మంత్రులు ప్రకటించారు.


బీసీ రిజర్వేషన్ల వివరాలిలా..

గ్రామ వార్డు మెంబర్లకు-26.73 శాతం, సర్పంచులకు-27.95 శాతం, ఎంపీటీసీలకు-25.55 శాతం, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు-24.60 శాతం, జెడ్పీ ఛైర్ పర్సన్లకు-23.08 శాతం, అర్బన్ వార్డు మెంబర్లకు-32.78 శాతం, మున్సిపల్ ఛైర్మన్లకు-33.02 శాతం, మేయర్లకు-35.29 శాతం మేర బీసీ రిజర్వేషన్ల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సిఫార్సులను అమలు చేస్తూ చట్టపరంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని... అన్ని రకాల పదవుల్లోనూ 34 శాతం రిజర్వేషన్ల ఫలితాలను బీసీలకు దక్కేలా కూటమి పార్టీల పరంగా సీట్లు ఇస్తామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో అమలు చేసిన దానికంటే మెరుగ్గా బీసీలకు రిజర్వేషన్లు వర్తింపంజేసేలా తమ కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట

స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 04:12 PM