Share News

మంత్రి లోకేశ్ చొరవ.. ఆ పాఠశాలకు మహర్దశ

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:01 PM

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో శ్రీకాకుళం న‌గ‌రంలోని ఎచ్చెర్ల వీధి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. కార్పొరేట్ స్కూలును తలపించేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు.

మంత్రి లోకేశ్ చొరవ.. ఆ పాఠశాలకు మహర్దశ
AP Minister Nara Lokesh

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) చొరవతో శ్రీకాకుళం న‌గ‌రంలోని ఎచ్చెర్ల వీధి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల రూపురేఖలు మారాయి. కార్పొరేట్ స్కూలును తలపించేలా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ మేరకు ఎక్స్‌లో లోకేశ్ పోస్టు పెట్టారు.


పాఠ‌శాల రూపురేఖ‌లు మారుస్తాన‌ని అప్పుడే మాటిచ్చాను..

‘గ‌తంలో శ్రీకాకుళం న‌గ‌రంలోని ఎచ్చెర్ల వీధి మునిసిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాలను ఆక‌స్మికంగా సంద‌ర్శించాను. విద్యార్థులతో మాట్లాడాను. వారి ఇబ్బందులు తెలుసుకున్నాను. పాఠ‌శాల భ‌వ‌నం శిథిల‌మై క‌నిపించింది. క‌నీస మౌలిక వ‌స‌తులు లేవు. పాఠ‌శాల రూపురేఖ‌లు మారుస్తాన‌ని అప్పుడే మాటిచ్చాను. ప్ర‌భుత్వం చొర‌వ‌, వివిధ‌శాఖ‌ల స‌హ‌కారం, విద్యాశాఖ అధికారుల కృషి, దాత‌ల స‌హ‌కారంతో రెండేళ్ల వ్యవధిలోనే పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. నాడు నేను చూసిన శిథిల పాఠ‌శాల నేడు కార్పొరేట్ స్కూలును త‌ల‌పిస్తోంది. అంద‌మైన‌ భ‌వ‌నం, ఫ‌ర్నిచ‌ర్‌, డిజిటల్ తరగతి గదులు, సురక్షితమైన తాగునీటి వ్యవస్థ, పరిశుభ్రమైన ఆవరణ, నీటివ‌స‌తితో ఆధునిక మరుగుదొడ్లు అందుబాటులోకి వచ్చాయి. పూర్తిస్థాయి వ‌స‌తుల‌తో సిద్ధ‌మైన ఎచ్చెర్ల వీధి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ప్రాథ‌మిక పాఠ‌శాల‌ను నిన్న‌ కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంక‌ర్, స‌మ‌గ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాస‌రావు క‌లిసి ప్రారంభించార‌ని తెలిసి చాలా సంతోషించాను. పాఠ‌శాల‌ను స‌ర్వాంగ‌సుంద‌రంగా తీర్చిదిద్ద‌డంలో భాగ‌మైన‌ ప్రతీ ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను’ అని లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట

స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 10:37 PM