Share News

ఈ నెల 13న ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. ఎందుకంటే..

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:55 PM

తమిళనాడు సీఎం విజయ్ విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడకు ఆయన రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది.

ఈ నెల 13న ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. ఎందుకంటే..
Tamil Nadu CM Vijay

విజయవాడ, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం విజయ్ (Tamil Nadu CM Vijay) విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడకు ఆయన రానున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుతో విజయ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కృష్ణా జలాల వాటాపై మాట్లాడనున్నారు.


తెలుగు గంగ ఒప్పందం ప్రకారం తమకు నీరు అందట్లేదని తమిళనాడు సర్కార్ చెబుతోంది. ఏపీ నుంచి రావాల్సిన నీటి వాటాపై చంద్రబాబుతో విజయ్ చర్చించే అవకాశాలు ఉన్నాయి. ఏపీ నిర్మించతలపెట్టిన డ్యామ్‌ల అంశంపైనా మాట్లాడే ఛాన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తోనూ విజయ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట

స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం

ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 10 , 2026 | 05:41 PM