Share News

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 11 , 2026 | 12:36 PM

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు.

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్
Pawan Kalyan

పోలవరం జిల్లా, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని ఉద్ఘాటించారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయటానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. అల్లూరి సీతారామరాజును తాను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తున్నానని పేర్కొన్నారు. ఈరోజు (ఆదివారం) పోలవరం జిల్లాలోని కాకవాడలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అడవితల్లి బాట బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.


వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్ కల్పిస్తాం..

వైద్యం కోసం డోలీ మోతలతో వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని పవన్ కల్యాణ్ తెలిపారు. రాకోటలో వెదురుతో చేసిన వస్తువులకు మార్కెట్‌లో ధర కల్పిస్తామని భరోసా కల్పించారు. ఏడు జిల్లాలకు సంబంధించిన గిరిజన ఆవాసాల్లో రూ.1000 కోట్లతో రహదారులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రోడ్లను నిర్మిస్తే విద్య, వైద్యం, రవాణాకు ఉపయోగపడతాయని వివరించారు. సినిమాల్లో రెండు గంటల్లో జరిగినవి.. నిజ జీవితంలో జరగవని చెప్పుకొచ్చారు. నిజ జీవితంలో పనిచేయటానికి మాత్రమే ఉన్నామని జనసైనికులకు తాను చెబుతున్నామని అన్నారు. అల్లూరి సీతారామరాజు గిరిజనుల కోసం బతికారని ఉద్ఘాటించారు. ఖర్చు కోసం ఆలోచించకుండా రహదారులను తాము నిర్మిస్తున్నామని తెలిపారు.


ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలు..

ఎన్నికల్లో మాత్రమే రాజకీయాలని.. ఇప్పుడు అభివృద్ధిపైనే దృష్టిసారించామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రూ.7వేల కోట్లతో ఏడు జిల్లాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రోడ్డు లేని గిరిజన గ్రామం.. అభివృద్ధి లేని కుటుంబం ఉండకూడదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే ఆయా గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

మంత్రి లోకేశ్ చొరవ.. ఆ పాఠశాలకు మహర్దశ

ఈ నెల 13న ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. ఎందుకంటే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 01:54 PM