Home » Kanaka durga temple
తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు.
శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు.
వినాయక పూజతో ఉత్సవాలకు ఈవో శీనానాయక్ అంకురార్పణ చేశారు. అమ్మవారి పూజలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.
ఈ నెల 22 నుండి వచ్చే నెల 2 వరకు నవరాత్రులు జరుగనున్నాయి. ఈ ఏడాది 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు నిబంధనలను కచ్చితంగా పాటించే భక్తుల్లో కొందరు ఇంద్రకీలాద్రి విషయానికి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
Warahi Celebrations: ప్రముఖ పుణ్యక్షేత్రమైన విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో గురువారం నుంచి వారాహి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ఈవో శీనానాయక్ దంపతులు తొలి సారెను సమర్పించారు. ఈ ఉత్సవాలు నెల రోజుల పాటు జరగనున్నాయి.
Vijayawada Durgamma: ప్రతిరోజూ ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 12.15 మధ్య అమ్మవారికి మహా నైవేద్య సమర్పణ, ఆలయ శుద్ది కార్యక్రమాలు ఉంటాయి. నైవేద్య సమయంలో దర్శన విరామం వలన పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించి..
Indrakeeladri: తెలంగాణ రాష్ట్రం, సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ అనే భక్తుడు బెజవాడ కనకదుర్గ అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీరను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్ ఆయనను అభినందించి అమ్మవారి తీర్థ ప్రసాదములను అందజేశారు.
దుర్గగుడి దేవస్థానంలో అత్యంత కీలకమైన 8 ఫైళ్ళు గల్లంతు అయినట్లు అధికారులు గుర్తించారు. కోర్టుకు వెళ్లిన ఉద్యోగుల సర్వీస్ సంబంధించిన కేసుల ఫైళ్లు గల్లంతు అయ్యాయి. ఈ ఫైళ్ల ఆధారంగానే కోర్టు కేసుల్లో కౌంటర్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఫైళ్లు కనిపించకపోవడంతో ఈవో వాటికి సంబంధించిన అధికారులను పిలిచి వివరాలు అడిగారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో పలు కీలక విభాగాల్లో పనిచేస్తున్న ఎనిమిది మంది ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈవో, దేవాదాయ శాఖ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బదిలీ ఉత్తర్వులు చూసి అందరూ నివ్వెరపోయారు. ఎక్కడి వారిని అక్కడే బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం.