Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారా సేవలు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 12:27 PM
ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది..
విజయవాడ, జనవరి13 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి (Vijayawada Kanaka Durga Temple) వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా దేవాదాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల కోసం ఆన్‌లైన్ సేవలను అధికారికంగా ప్రారంభించింది. దర్శన టిక్కెట్లు, సేవా పూజలు, ప్రసాదం, వసతి గదుల బుకింగ్ వంటి అనేక సేవలను ఇకపై ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చని తెలిపింది. క్యూలైన్లలో వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ డిజిటల్ సేవలను ప్రవేశపెట్టినట్లు దేవాదాయ శాఖ పేర్కొంది. నగదు రహిత చెల్లింపులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందని వెల్లడించింది. ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
వాట్సాప్ ద్వారా..
వాట్సాప్ నంబర్ 9552300009ను వినియోగించుకోవాలని సూచించింది. దర్శనం, ప్రసాదం, పూజా సేవల వివరాలు వాట్సాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని తెలిపింది. అధికారిక వెబ్‌సైట్ ద్వారా ముందస్తు బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. భక్తులు తమకు కావాల్సిన వివరాల కోసం వెబ్‌సైట్ : www.aptemples.ap.gov.in లో సంప్రదించాలని సూచించింది. శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో లభ్యమవుతాయని వెల్లడించింది.
ఆర్జిత సేవలు..
అమ్మవారికి నిర్వహించే ఆర్జిత సేవలు ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా పొందవచ్చని చెప్పుకొచ్చింది. దేవస్థాన వసతి గదుల కేటాయింపు ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. ఇంద్రకీలాద్రి ప్రాంగణంలో ప్రత్యేక డిజిటల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. QR కోడ్, కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపుల సౌకర్యం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. దళారులను నమ్మవద్దని దేవస్థానం అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన అధికారిక సేవలనే వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అనంతపురంలో భారీ అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే...
రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News