CM Chandrababu: రాష్ట్ర ప్రగతే లక్ష్యంగా సమగ్ర సమీక్ష.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:55 AM
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సోమవారం సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు.
అమరావతి, జనవరి12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ సచివాలయంలో సమీక్షా సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు, కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు. ఈ సమావేశం నేడు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కాగా.. మధ్యాహ్నం 2:00 గంటలకు ముగియనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అభివృద్ధిపై చర్చ..
ఏపీ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజా సేవల మెరుగుదలకు సంబంధించిన ముఖ్య అంశాలపై సీఎం మాట్లాడుతున్నారు. రాష్ట్ర స్థూల ఆర్థికోత్పత్తి(జీఎస్డీపీ), పరిపాలనా సంవర్థనకు పది సూత్రాలు, ఆదాయార్జన శాఖల పనితీరుపై సమీక్షిస్తున్నారు. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు, పురోగతి, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) సహిత పెట్టుబడి ప్రతిపాదనల సమీక్షపై మాట్లాడుతున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా శాఖల ఫైళ్ల పరిష్కార స్థితి, డిజిటల్ పరివర్తన, వాట్సాప్ గవర్నెన్స్ వంటి ఆన్‌లైన్ సేవలు, రెవెన్యూ శాఖ కార్యకలాపాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూమి సర్వే, 'వికసిత్ భారత్ – గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్(గ్రామీణ)' పథకం వంటి వివిధ ప్రధాన విషయాలపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్ర ప్రగతి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు దోహదపడే విధంగా ప్రభుత్వ యంత్రాంగం మరింత సమర్థవంతంగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా పనిచేసే విధంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మార్కాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News