Share News

Teppotsavam Cancelled: విజయదశమి రోజు కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దు..

ABN , Publish Date - Oct 01 , 2025 | 04:49 PM

తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు.

Teppotsavam Cancelled: విజయదశమి రోజు కనకదుర్గమ్మ తెప్పోత్సవం రద్దు..
Kanaka Durgamma Teppotsavam

అమరావతి: విజయదశమి రోజు కనకదుర్గమ్మ తెప్పోత్సవం అధికారులు రద్దు చేశారు. కృష్ణా నదికి 6 లక్షల 75 వేల క్యూసెక్కుల వరద వస్తుండటంతో అమ్మవారి నదీ విహారం రద్దు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు హంస వాహనంలో దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి దుర్గ గుడి అర్చక స్వాములు పూజలు నిర్వహించనున్నారు.


తెప్పోత్సవం నిర్వహిస్తే ప్రమాదం ఉంటుందని, ఫంట్ మీద అమ్మవారికి పూజలు మాత్రమే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో భక్తులు నిరుత్సాహానికి గురయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెల్లో దసరా పండుగ శోభ సంతరించుకుంది. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తజనం అమ్మవారిని దర్శించి తరించిపోతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పూజలు చేసి భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.


ఇవి కూడా చదవండి..

బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ

26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి

Updated Date - Oct 01 , 2025 | 04:55 PM