Navaratri 2025: దుర్గమ్మను దర్శించుకున్న హోంమంత్రి.. ఏర్పాట్లపై ఏమన్నారంటే
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:47 AM
శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు.
విజయవాడ, సెప్టెంబర్ 22: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు (Navaratri 2025) వైభవంగా జరుగుతున్నారు. తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హెంమంత్రికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై క్యూ లైన్లో భక్తులను అడిగి తెలుసుకున్నారు మంత్రి. దర్శనానంతరం హోంమంత్రి అని మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న కూటమి ప్రభుత్వం మరో 20 ఏళ్ల పాటు ఉండాలని దుర్గమ్మను కోరుకున్నాట్లు తెలిపారు. రాష్ట్రంపై సైకోల కళ్ళు పడకూడదని దుర్గమ్మను వేడుకున్నానని హోంమంత్రిర వంగలపూడి అనిత పేర్కొన్నారు.
సామాన్య భక్తులకే పెద్దపేట: మంత్రి ఆనం

మరోవైపు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి కూడా దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. దుర్గమ్మ వారి దర్శనం ఘనంగా జరిగిందన్నారు. అమ్మవారి దర్శనాలు ప్రారంభం అయ్యాయని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల అనుసరం ఉత్సవాలకు ఏర్పాట్లు మంచిగా చేశారని చెప్పుకొచ్చారు. వర్షాలు పడటం శుభ పరిణామన్నారు. 11 రోజుల పాటు ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని.. అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు. తొలి రోజు కాస్త ఒత్తిడి ఉంటుందని.. భక్తులు అందరికీ బంగారు వాకిలి వరకే దర్శనం ఏర్పాటు చేశారన్నారు. వీఐపీలకు టైమ్ స్లాట్ ఏర్పాటు చేశామన్నారు.
సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఉత్సవాలో పాల్గొనే అధికారులు అందరూ సంప్రదాయ దుస్తులోనే విధులు నిర్వహించాలని చెప్పారు. అన్నప్రసాదం, లడ్డు కౌంటర్ లో ఎటువంటి ఇబ్బంది లేదని తెలియజేశారు. భక్తుల అభిప్రాయం తీసుకున్నామని.. అందరూ సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. 29వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా పరిశీలించటం జరిగిందని అన్నారు. విజయవాడ ఉత్సవ్‌కు ఇంద్రకీలాద్రిపై జరిగే ఉత్సవాలకు ఎటువంటి ఇబ్బంది లేదని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Vijayawada: ఇంద్రకీలాద్రికి దసరా శోభ
ఆ మార్పులతో ముందుగానే దసరా: బీజేపీ
Read Latest AP News And Telugu News