Home » Vangalapudi Anitha
విశాఖ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ వాడుతూ ఈగల్ టీంకు దొరికిపోయారని హోంమంత్రి అనిత తెలిపారు. కొండారెడ్డి యువతకు డ్రగ్స్ ఇచ్చి పాడు చేస్తుంటే జగన్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రైనేజీ, ఇరిగేషన్, భద్రతా చర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు చాలా బాగున్నాయని హోంమంత్రి అనిత అన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనంతపురంలో బుధవారం నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
మచిలీపట్నంలో ఇటీవల రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏడుగురు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Anitha: జగన్‌పై హోంమంత్రి అనిత నిప్పులు చెరిగారు. రప్పా రప్పా అని వైసీపీ నేతలు అనడాన్ని జగన్ సమర్థిస్తున్నారని ఫైరయ్యారు. రక్తం పంచుకుని పుట్టిన సొంత చెల్లి గురించే తప్పుడు ప్రచారం చేసిన నీచ చరిత్ర జగన్ రెడ్డిదని అన్నారు. రౌడీషీటర్లను పరామర్శిస్తున్న వ్యక్తి జగన్ అని చురకలు అంటించారు.
Yoga Event: హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ పర్యాటక ప్రాంతమైన రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల ఆరోగ్యం కోసం ఆలోచించిన నాయకులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు అని అన్నారు.
Operation Sidoor: భారత్ - పాక్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబానికి ఎమ్మెల్యే బాలయ్య అండగా నిలిచారు. రేపు స్వగ్రామంలో జవాన్ అంత్యక్రియలు జరుగనున్నాయి.
Simhachalam: సింహాచలంలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవం మరికొద్ది రోజుల్లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో హో మంత్రి అనిత.. అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు.