Vangalapudi Anitha: భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన హోంశాఖ మంత్రి
ABN , Publish Date - Sep 09 , 2025 | 02:18 PM
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనంతపురంలో బుధవారం నాడు సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రేపు(బుధవారం) అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సభా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. డ్రోన్ వ్యవస్థ ద్వారా తొలిసారిగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందన్నారు. 6 వేల మంది పోలీసులతో సూపర్ 6 సూపర్ హిట్ సభకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాజీ సీఎం జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి బయటకు వస్తే పూర్తి వాస్తవాలు తెలుస్తాయని.. అంతేగానీ తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. 15 నెలల్లో రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సరఫరాను పూర్తిగా నియంత్రించామన్నారు.
సోషల్ మీడియా నియంత్రణకు త్వరలోనే చట్టం రాబోతోందని మంత్రి పేర్కొన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారిని ఖచ్చితంగా నియంత్రిస్తామన్నారు. అనంతరం, పార్కింగ్ ప్రదేశాలతోపాటు వీఐపీల భద్రతా ఏర్పాట్ల వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అలాగే, సభ కారణంగా ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి అనిత కీలక ఆదేశాలు జారీ చేశారు.
Also Read:
ఓరి నాయనో.. ఒకే వ్యక్తి.. ఒకేసారి ఆరు జిల్లాల్లో ఉద్యోగం.. రూ.3 కోట్ల జీతం
నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు
For More Latest News