Share News

Nandigama YCP Protest: నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:24 AM

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

Nandigama YCP Protest: నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు
Nandigama YCP Protest

ఎన్టీఆర్ జిల్లా: నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేందుకు పోలీసు శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే, పోలీసు శాఖ అనుమతులు ఇవ్వలేదని వైసీపీ అసత్య ప్రచారం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. నిబంధనలకు అనుగుణంగా కార్యక్రమం నిర్వహించుకోవాలని పోలీసు శాఖ చెప్పినప్పటికీ ఆ పార్టీ శ్రేణులు లెక్కచేయలేదు. RDO/ MROలను అతి కొద్ది మంది మాత్రమే కలసి వినతిపత్రం అందజేయాలని పోలీసు శాఖ సూచించింది.


నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు ఎటువంటి అనుమతి లేదని హెచ్చరించింది. అయితే, అధికారులు చెప్పిన నియమాలు పాటించకపోవడంతో పోలీసులు వైసీపీ నిరసన ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో అడ్డుకున్న పోలీసులపై వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్సీ జగన్మోహన్‌, వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతవారణం నెలకొంది.

Updated Date - Sep 09 , 2025 | 11:42 AM