Share News

UP Cheating Case: ఓరి నాయనో.. ఒకే వ్యక్తి.. ఒకేసారి ఆరు జిల్లాల్లో ఉద్యోగం.. రూ.3 కోట్ల జీతం

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:19 PM

ఉత్తరప్రదేశ్‌లో విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి, ఒకేసారి ఏకంగా ఆరు జిల్లాల్లో ఉద్యోగం చేస్తూ, రూ.3 కోట్ల జీతం తీసుకున్నాడు.

UP Cheating Case:  ఓరి నాయనో.. ఒకే వ్యక్తి.. ఒకేసారి ఆరు జిల్లాల్లో ఉద్యోగం.. రూ.3 కోట్ల జీతం
UP Cheating Case

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకే వ్యక్తి, ఒకేసారి ఏకంగా ఆరు జిల్లాల్లో 9 సంవత్సరాలపాటు ఉద్యోగం చేస్తూ రూ.3 కోట్ల జీతం తీసుకున్నాడు. ఇదెలా సాధ్యం.. ఒకే వ్యక్తి, ఒకేసారి ఆరు జిల్లాల్లో ఎలా పనిచేశాడు? 9 సంవత్సరాల పాటు ఆయా వ్యవస్థలకు ఎటువంటి క్లూ కూడా లేకుండా ఎలా మ్యానేజ్ చేశాడు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


2016లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో 403 మంది ఎక్స్-రే టెక్నీషియన్లను నియమించారు. ఈ నియామకాల్లో అర్పిత్ సింగ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు 6 జిల్లాల్లో ఉద్యోగాలు చేస్తూ, ప్రతి ఉద్యోగం నుంచి జీతం తీసుకుంటూ ఉన్నాడు. అలా తొమ్మిది సంవత్సరాలు సాఫీగా సాగిపోయింది. ఏ జిల్లా అధికారులకు కూడా అనుమానం రాకుండా మ్యానేజ్ చేస్తూ వచ్చాడు.

ఇలా దొరికిపోయాడు

ఇటీవల ఆరోగ్య శాఖ మానవ్ సంపద పోర్టల్ అనే సాంకేతిక ప్లాట్‌ఫారంపై ఉద్యోగుల డేటా అప్డేట్ చేయించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల డేటాను చూడగలిగే సిస్టమ్. ఆ పోర్టల్ ద్వారా అన్ని జిల్లాల ఉద్యోగుల వివరాలను ఒకేచోట చూసేందుకు వీలు ఉంటుంది. ఇలా అతడి అసలు స్వరూపం బట్టబయలైంది. ఒకే పేరు.. ఒకే తండ్రి పేరు.. ఒకే చిరునామా.. ఒకే పుట్టిన తేదీ ఉన్నా.. 6 వేర్వేరు ఉద్యోగాలు ఉన్నాయని.. ఆధార్ నంబర్లు వేరుగా ఉన్నప్పటికీ, మిగతా సమాచారం మొత్తం ఒకేలా ఉండటంతో ఆ వ్యక్తి దొరికిపోయాడు.


ప్రత్యేక కమిటీ

పోలీసులు అర్పిత్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి డిజి హెల్త్ రతన్ పాల్ సుమన్ ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. డైరెక్టర్ పారామెడికల్ డాక్టర్ రంజనా ఖరే నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. నివేదిక ఆధారంగా, లక్నోలోని వజీర్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రస్తుతం, పరారీలో ఉన్న నిందితుడు అర్పిత్ సింగ్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.

3 కోట్ల 24 లక్షలు

సగటున, ఒక ఎక్స్-రే టెక్నీషియన్ నెలకు దాదాపు రూ. 50 వేల జీతం పొందుతాడు. ఈ విధంగా, అతను 1 సంవత్సరంలో మొత్తం 6 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ తొమ్మిది సంవత్సరాలలో అది 54 లక్షల రూపాయలు అయింది. అర్పిత్ సింగ్ ఆరు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్నప్పుడు, మొత్తం 3 కోట్ల 24 లక్షల రూపాయలు జీతం తీసుకున్నట్లు తెలిసింది. ఇలా, ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు గండిపడింది.


Also Read:

గ్రూప్ 1 పరీక్ష ఫలితాల రద్దు.. హరీష్ రావు ఘాటు రియాక్షన్..

నందిగామలో ఉద్రిక్తత.. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు

For More Latest News

Updated Date - Sep 09 , 2025 | 01:25 PM