Home Minister Anitha On Rains : బీ అలర్ట్.. పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:47 AM
రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. డ్రైనేజీ, ఇరిగేషన్, భద్రతా చర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
అమరావతి: రాష్ట్రంలో విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులకు సూచించారు.
పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలను క్లియర్ చేసి, వర్షపు నీరు ఎప్పటికప్పుడు పోయేలా చూడాలన్నారు. ఇరిగేషన్ అధికారులు కట్టల వెంబడి ఇసుక బ్యాగ్స్ వంటి సాంకేతిక సాధనాలను అందుబాటులో ఉంచి అత్యవసర పరిస్థితులలో ఉపయోగించుకోవాలని సూచించారు.
వచ్చే వారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున యంత్రాంగం అలెర్ట్‌గా ఉండాలని చెప్పారు. పిడుగులతో కూడిన వర్షాల సమయంలో రైతులు పంట పొలాల్లో ఉండవద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలను పాటించాలని హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు.
Also Read:
కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకోనున్న రేవంత్ సర్కార్..
ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే.. రోజంతా ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు!
For More Latest News