AP Govt Alert: భారీ వర్షాలు.. ఏపీ సర్కార్ అప్రమత్తం
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:19 AM
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 26: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు (శుక్రవారం) సమీక్ష నిర్వహించారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. కోస్తాంధ్ర, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలకు ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ పోలీసు, ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదనని ఆదేశించారు హోంమంత్రి. పొంగిపొర్లే కాలువలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు. ఈదురుగాలులు వీచే సమయంలో చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడరాదని హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
కాగా.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం.. నేడు వాయువ్య, పశ్చిమగ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి.. రేపు దక్షిన ఒడిశా-ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
Read latest AP News And Telugu News