Heavy Rainfall Alert: అతిభారీ వర్షాలు.. తీర ప్రాంతాలకు అలెర్ట్
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:50 AM
రేపు (శనివారం) ఉదయానికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర వద్ద తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 26: రాష్ట్రంలో పలు చోట్ల అతి భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. ఈరోజు (శుక్రవారం) వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. రేపు (శనివారం) ఉదయానికి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర వద్ద తీరాలను దాటే ఛాన్స్ ఉంది. దీని ప్రభావంతో నేడు రాష్ట్రంలో ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
వర్షాలు పడే ప్రాంతాలు ఇవే..
ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. అలాగే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోనూ కొన్నిచోట్ల భారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అల్పపీడం నేపథ్యంలో తీరం వెంబడి గంటకు 40 - 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. మత్స్యకారులు సోమవారం (సెప్టెంబర్ 29) వరకు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
జై మహాలక్ష్మి.. ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి
ట్రంప్ మళ్లీ షాకింగ్ ప్రకటన..భారత ఔషధ ఎగుమతులకు దెబ్బ..
Read latest AP News And Telugu News