Government Medical Colleges: మెడికల్ కాలేజీ అంశంపై మరోసారి వైసీపీ నిరసన..
ABN , Publish Date - Sep 22 , 2025 | 10:05 AM
వైసీపీ మండలి సభ్యులు అసెంబ్లీ బయట ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి ప్లకార్డులతో నిరసన తెలియజేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన చేస్తున్నారు.
మెడికల్ కాలేజీ అంశం మీద వైఎస్సార్ సీపీ మరోసారి నిరసనలు చేపట్టింది. వైసీపీ మండలి సభ్యులు అసెంబ్లీ బయట ఉన్న ఫైర్ స్టేషన్ నుంచి ప్లకార్డులతో నిరసన తెలియజేస్తూ అసెంబ్లీకి వెళ్లారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళన చేస్తున్నారు. నల్ల కండువాలతో అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తున్నారు.
అసలు కారణం ఇదేనా..
తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భీష్మించడం వెనుక వేరే కథ ఉందన్న ప్రచారం బాగా జరుగుతోంది. ఆ పార్టీ వర్గాలు కూడా ఇదే విషయాన్ని గుసగుసలాడుకుంటున్నాయి. మండలిలో సభ్యుల సంఖ్య 58 కాగా, ఇందులో వైసీపీ ఎమ్మెల్సీల సంఖ్యాబలం 34. అధికార కూటమి కంటే వైఎస్సార్ సీపీ సంఖ్యా బలం ఎక్కువగా ఉంది. దీంతో వైఎస్సార్ సీపీ పక్ష నేతగా బొత్స సత్యనారాయణకు అవకాశం లభించింది.
అధికారికంగా క్యాబినెట్ ర్యాంకు కూడా దక్కింది. అవసరమైనప్పుడు సభలో కాస్త ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటోంది. కానీ, వైఎస్ జగన్ ఎమ్మెల్యే మాత్రమే. పొరుగు సభలో బొత్స ప్రతిపక్ష నేత హోదాలో ఉంటే.. తాను కేవలం ఎమ్మెల్యేగా ఉండడంతో అహం అడ్డొచ్చి జగన్ అసెంబ్లీకి రానంటున్నారని వైసీపీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
నేడు ఉత్కంఠకు తెర.. బోనస్ ప్రకటించనున్న రాష్ట్ర ప్రభుత్వం..
ప్రియురాలిని చంపి.. శవంతో సెల్ఫీ దిగిన ప్రియుడు..