Share News

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ

ABN , Publish Date - Sep 22 , 2025 | 10:18 AM

నేటి అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయం రంగం, జీఎస్టీ సంస్కరణలు తదితర అంశాలపై చర్చ జరగనుంది.

AP Assembly Session: ఏపీ అసెంబ్లీలో నేడు వ్యవసాయ రంగంపై చర్చ
Andhra Pradesh Assembly session

ఇంటర్నెట్ డెస్క్: నేడు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవసాయ రంగంపై చర్చ జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రాబాబు (CM Chandrababu) తెలిపారు. అంతేకాకుండా.. ఎస్సీ వర్గీకరణ, ఎక్సైజ్ శాఖ చట్టసవరణ బిల్లులను మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టనున్నారు. మైదాన ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, రాష్ట్రంలో గ్రంథాలయాలపై కూడా నేడు చర్చ జరగనుంది. మైలవరం నియోజకవర్గంలో కాలుష్యం, చెట్లను రక్షిస్తూ విద్యుత్ తీగల ఏర్పాటు, పాతపట్నం నియోజకవర్గంలో ఐసీడీఎస్ భవనం, చంద్రన్న భీమా పథకం కింద చెల్లింపులపై ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. కోనసీమ జిల్లాలో మురుగునీటి పారుదల వ్యవస్థ, ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, రాష్ట్రంలో విలీనం చేసిన పాఠశాలలు, ప్రభుత్వ అప్పులు తదితర ప్రశ్నలపై మంత్రులు స్పందిస్తారు. శాసనమండలిలో జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేయనున్నారు (AP Assembly Session).


శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా 20లక్షల ఉద్యోగాల కల్పన, ఎన్ఆర్ఈజీఏ సాఫ్ట్ సమాచారాన్ని పొందుపరచటంలో తప్పులుపై చర్చ కూడా జరగనుంది. కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకం, దీపం-2 పథకం, సిమెంటు ధరల్లో వ్యత్యాసం, నకిలీ ఎరువుల విక్రయం ప్రశ్నలకు మంత్రుల సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు వైద్య పరీక్ష కేంద్రాలు, కబేళాలు, నాగావళి నది మీదుగా పూర్ణపాడు-లాబేసు వంతెన, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం తదితర అంశాలపై కూడా మంత్రుల స్పందిస్తారు.


ఇవి కూడా చదవండి

పబ్లిక్‌లో రెచ్చిపోయిన ప్రేమ జంట.. ముద్దులు పెట్టుకుంటూ.

Navaratri Durga Pooja: దుర్గమ్మ పూజలకు వేళాయె

Read Latest AP and Telangana News

Updated Date - Sep 22 , 2025 | 10:25 AM