Share News

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై జీవో 251 విడుదల

ABN , Publish Date - Oct 11 , 2026 | 10:32 AM

ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది.

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై జీవో 251 విడుదల
AP Government

అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ఏపీ పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు వర్తించేలా జీవో జారీ చేసింది. బీసీ రిజర్వేషన్ల ఖరారులో ప్రత్యేక కమిషన్ సిఫార్సులకు ఆమోదం తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రిజర్వేషన్లను అమలు చేయనుంది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, SGSW డేటా ఆధారంగా పట్టణాల్లో బీసీ రిజర్వేషన్ల నిర్ణయం తీసుకుంది. ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది.


మేయర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్లు, వార్డు సభ్యుల స్థానాలకు రొటేషన్ విధానంలో కూటమి సర్కార్ రిజర్వేషన్లను ఖరారు చేసింది. 2021లో అమలు చేసిన రిజర్వేషన్ సర్కిల్ ఆధారంగా తదుపరి రిజర్వేషన్లను వర్తింపజేయనుంది. ఆయా వార్డుల పునర్విభజన జరిగితే వార్డు సభ్యుల రిజర్వేషన్ సర్కిల్ కొత్తగా ప్రారంభించనుంది. రిజర్వేషన్ల అమలుపై తదుపరి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ పరిపాలన శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్ - 251ను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ జారీ చేశారు.


డెడికేటెడ్ కమిషన్ నివేదిక, సిఫార్సుల ఆధారంగానే పట్టణ స్థానిక సంస్థల్లో బీసీ కోటా ఖరారు చేసినట్లు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 'ట్రిపుల్ టెస్ట్' ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను కేటాయించింది. రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసింది. మొదట ఎస్టీ, తర్వాత ఎస్సీ, ఆపై బీసీ ప్రాధాన్యం క్రమంలో స్థానాలను కేటాయించింది. గతంలో ఇచ్చిన 33.33శాతం బీసీ రిజర్వేషన్ల జీఓపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఇచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో బీసీ రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్

మంత్రి లోకేశ్ చొరవ.. ఆ పాఠశాలకు మహర్దశ

ఈ నెల 13న ఏపీకి తమిళనాడు సీఎం విజయ్.. ఎందుకంటే..

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 11 , 2026 | 11:10 AM