Share News

విండీస్‌పై సిరీస్‌ను సొంతం చేసుకుని.. వైభవ్‌కు అవకాశమివ్వండి: నాయర్

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:37 AM

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకున్న తర్వాత చివరి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని అభిషేక్ నాయర్ సూచించాడు. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌పైనా ప్రశంసలు కురిపించాడు.

విండీస్‌పై సిరీస్‌ను సొంతం చేసుకుని.. వైభవ్‌కు అవకాశమివ్వండి: నాయర్
Abhishek Nair supports Viabhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలని భారత మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ సూచించాడు. నాల్గో మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్నాక చివరి మ్యాచ్‌లో అతడికి ఛాన్స్ ఇవ్వాలని నాయర్‌ అన్నాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ టీమ్ఇండియా సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో ముందుగా సిరీస్‌ను గెలిచి.. ఆఖరి మ్యాచ్‌లో వైభవ్‌ను ఆడించాలని నాయర్‌ అభిప్రాయపడ్డాడు.


'భారత్‌ ముందు 3-1తో ఆధిక్యంలోకి వెళ్లి సిరీస్‌ను సొంతం చేసుకోవాలి. ఆ తర్వాత చివరి మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలి' అని నాయర్‌ అన్నాడు. కాగా.. విండీస్‌తో సిరీస్‌లో ఇప్పటివరకు వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌లకే టీమ్ఇండియా యాజమాన్యం ఓపెనర్లుగా అవకాశాలు కల్పిస్తోంది.


మరోవైపు.. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించని అభిషేక్‌ శర్మ మూడో టీ20లో 69(6 ఫోర్లు, 5 సిక్స్‌లతో) పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి స్పిన్నర్‌ రోస్టన్‌ చేజ్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో అభిషేక్‌ను ఔట్‌ చేయగా.. మూడో మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌లో దీటుగా ఓపెనర్‌ బదులిచ్చాడీ స్టార్ ఓపెనర్. ఈ క్రమంలో అభిషేక్ బ్యాటింగ్‌పై ప్రశంసలు కురిపించాడు నాయర్. ప్రత్యర్థి బౌలర్‌ వ్యూహాన్ని అర్థం చేసుకుంటూ.. అవసరమైనప్పుడు స్లోగా ఆడి, ఆ తర్వాత దూకుడు పెంచడం అభిషేక్‌ ప్రత్యేకత అన్నాడు. కాగా.. భారత్‌-వెస్టిండీస్‌ మధ్య నాలుగో టీ20 బుధవారం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవడంపై టీమ్ఇండియా దృష్టి సారించనుంది.


ఇవీ చదవండి:

రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్

వేదికల్లో ఎలాంటి మార్పులూ లేవు

Updated Date - Oct 13 , 2026 | 11:38 AM