పొవెల్, రూథర్‌ఫోర్డ్‌కు జరిమానా
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:21 AM
భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్ క్రికెటర్లు రోవ్‌మన్ పొవెల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌కు జరిమానా పడింది.
ఇండోర్: భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించిన వెస్టిండీస్ క్రికెటర్లు రోవ్‌మన్ పొవెల్, షెర్ఫానె రూథర్‌ఫోర్డ్‌కు జరిమానా పడింది. వీరిద్దరి ఖాతాలో చెరో డీమెరిట్ పాయింట్ జమ చేశారు. ఆ మ్యాచ్‌లో మయాంక్ బౌలింగ్‌లో బౌల్డయిన పొవెల్.. బంతిని తన బ్యాటుతో బలంగా కొట్టాడు. ఇక..వైడ్ ఇవ్వనందుకు అంపైర్‌పై రూథర్‌ఫోర్డ్ గట్టిగా అరిచాడు.