Share News

వేదికల్లో ఎలాంటి మార్పులూ లేవు

ABN , Publish Date - Oct 13 , 2026 | 05:23 AM

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో డిసెంబరు 13న ఢిల్లీలో జరగాల్సిన తొలి మ్యాచ్‌ వేదికను అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్టు వస్తున్న..

వేదికల్లో ఎలాంటి మార్పులూ లేవు

  • శ్రీలంకతో సిరీస్‌పై బీసీసీఐ కార్యదర్శి సైకియా

న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో డిసెంబరు 13న ఢిల్లీలో జరగాల్సిన తొలి మ్యాచ్‌ వేదికను అహ్మదాబాద్‌కు తరలిస్తున్నట్టు వస్తున్న ఊహాగానాలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఖండించాడు. నిబంధనల ప్రకారం ఆ మ్యాచ్‌ను ఢిల్లీకి కేటాయించామని, వేదిక విషయంలో ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేశాడు. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిర్మాణ పనుల కారణంగా వేదిక మారుస్తున్నారనే ఊహాగానాలు వెలువడ్డాయి.

Updated Date - Oct 13 , 2026 | 05:25 AM