Share News

మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తా: విజయసాయి రెడ్డి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:26 AM

విజయదశమి సందర్భంగా కొత్త పార్టీకి సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా ప్రకటించారు. పార్టీ పేరు, జెండా, అజెండా సిద్ధమవుతున్నాయని తెలిపారు. రెండు కుటుంబ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రతి నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తానని పేర్కొన్నారు.

మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తా: విజయసాయి రెడ్డి
Vijaya Sai Reddy

విశాఖపట్నం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నూతన పార్టీ ఏర్పాటుపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) కీలక ప్రకటన చేశారు. విజయదశమి నాడు కొత్త పార్టీ వివరాలను వెల్లడిస్తానని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. తన పార్టీ పేరు, జెండా, అజెండా ఈ పవిత్ర దసరా పర్వదినాల్లో సిద్ధం అవుతున్నాయని స్పష్టం చేశారు. విజయదశమికి కొత్త పార్టీ ప్రకటిస్తానని పేర్కొన్నారు.


నాది బాల్‌ఠాక్రే పాత్ర..

తాను పార్టీ పెడుతున్నానని తెలిసి కొంతమంది తనపై విమర్శలు చేస్తున్నారని విజయసాయి రెడ్డి అన్నారు. వారు తనపై చేస్తున్న చౌకబారు ప్రచారాలకు ఎలాంటి విలువ ఉండదని చెప్పుకొచ్చారు. ఏపీలో రెండు కుటుంబ పార్టీలమీద తిరుగుబాటుగా, ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ మెరికల్లాంటి కొత్త నాయకత్వం తయారు చేస్తానని తెలిపారు. మరోసారి చెబుతున్నా... తన పార్టీలో అధికారం జెన్‌–జీది, నాది బాల్‌ఠాక్రే పాత్ర అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం

ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 12:22 PM