Share News

ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం

ABN , Publish Date - Oct 12 , 2026 | 01:43 PM

శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మించమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
AP Minister Anam Ramnarayana Reddy

నెల్లూరు జిల్లా, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 వేల ఆలయాలను నిర్మించమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం మహ్మదాపురంలో రూ.2 కోట్లతో వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి ఆనం ఈరోజు (సోమవారం) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడారు.


పూజారుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ..

రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో శ్రీవారి ఆలయాలను ఒక్కొక్కటి చొప్పున నిర్మించాలని తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని మంత్రి వెల్లడించారు. ఒక్కో ఆలయ నిర్మాణానికి రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు కేటాయిస్తున్నామని తెలిపారు. 6,700 ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు నెలకు రూ.10 వేల చొప్పున పూజారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి ఆనం పేర్కొన్నారు.


ఆత్మకూరులో రూ.35 కోట్లతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశాం: మంత్రి ఆనం

అనంతరం, ఆత్మకూరు మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో నేడు రూ.35 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశామని వెల్లడించారు. సోమశిల జలాశయం నుంచి పైపులైన్ ద్వారా ఆత్మకూరుకు తాగునీటిని అందించామని చెప్పుకొచ్చారు. ఆత్మకూరు పట్టణంలో అంబేడ్కర్, షాదీ మంజిల్ భవనాలకు నిధులు మంజూరు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో అన్నిరంగాలు అభివృద్ధి చెందుతున్నాయి: చిరంజీవి

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ: పవన్ కల్యాణ్

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై జీవో 251 విడుదల

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 12 , 2026 | 01:56 PM