రాహుల్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్
ABN , Publish Date - Oct 13 , 2026 | 12:06 PM
బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఢిల్లీ, అక్టోబర్ 13: బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీపై చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జనహిత యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని జ్ఞానేశ్ కుమార్ ఏ విధంగా దుర్వినియోగం చేశారో రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు. బీజేపీ చీప్ పాలిటిక్స్ చేస్తోందని విరుచుకుపడ్డారు. కర్ణాటక సీఎం డీకే.శివకుమార్‌ను రాహుల్ సెక్యూరిటీ తోసేశారని బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాహుల్ గాంధీకి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక బీజేపీ దుష్ప్రచారం మొదలు పెట్టిందని ఎంపీ ఆరోపించారు. రాహుల్ ర్యాలీలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఇండియా కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారని తెలిపారు. సామాన్య కార్యకర్తలతో నడవాలని రాహుల్ గాంధీ భావిస్తారని.. సెక్యూరిటీ వాళ్లకు ఆయన భద్రత ముఖ్యమన్నారు. కర్ణాటక బీజేపీ, అదే విధంగా బీజేపీ సోషల్ మీడియా చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హితవుపలికారు.
ఇవి కూడా చదవండి...
కాచిగూడలో తప్పిన ప్రమాదం.. తండ్రి, కూతురిని కాపాడిన కానిస్టేబుల్
ఎన్నికల్లో గెలవలేక రాజ్యంగ సంస్థలపై దండయాత్ర.. కాంగ్రెస్‌పై కిషన్‌రెడ్డి విమర్శలు
Read Latest Telangana News And Telugu News