Share News

హైదరాబాద్‌లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ

ABN , Publish Date - Oct 13 , 2026 | 08:44 AM

హైదరాబాద్‌ నాంపల్లిలో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు. బిట్‌కాయిన్‌గా మార్పిస్తామంటూ కొందరు రూ.21 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగింది.

హైదరాబాద్‌లో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీ
Hyderabad Nampally Crypto Currency Fraud

హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ నాంపల్లిలో క్రిప్టోకరెన్సీ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారు. బిట్‌కాయిన్‌గా మార్పిస్తామంటూ కొందరు రూ.21 లక్షలు దోపిడీ చేశారు. ఈ ఘటన నాంపల్లి బజార్ ఘాట్‌లో జరిగింది. బ్యాంక్ లోన్ ఫెసిలిటేటర్‌గా ఎర్రగడ్డ మోతీనగర్‌కు చెందిన అమరేంద్ర పనిచేస్తున్నాడు. తన వద్ద ఉన్న రూ. 25 లక్షలను క్రిప్టోకరెన్సీగా మార్చాలని అమరేంద్రను జూబ్లీహిల్స్‌కు చెందిన షానవాజ్ కోరాడు.


స్నేహితులు విజయ్‌కుమార్, అమర్‌కుమార్‌ల సలహాతో నాంపల్లి బజార్ ఘాట్‌లోని బినాన్స్ వాలెట్ కార్యాలయానికి అమరేంద్ర వెళ్లాడు. ఈ ఆఫీసులో సుమేర్, సయ్యద్ పేర్లతో ఇద్దరు వ్యక్తులు పరిచయం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రూ.25 లక్షలకు క్రిప్టోకరెన్సీ కావాలని అమరేంద్ర కోరాడు. ముందుగా నగదు చూపించాలని నిందితులు అడిగారు. నగదు చూపించగానే ఒక్కసారిగా అమరేంద్ర కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టి దాడికి పాల్పడ్డారు.


అమరేంద్ర వద్ద ఉన్న రూ.25 లక్షలను లాక్కొని పరారయ్యేందుకు నిందితులు యత్నించారు. వారిని పట్టుకునేందుకు విజయ్‌కుమార్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో నిందితుల చేతుల్లో నుంచి రూ.4 లక్షలు కిందపడ్డాయి. మిగిలిన రూ.21 లక్షలతో వారు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని నాంపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం

ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 10:08 AM