స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌పై ఎస్‌ఈసీ ఏం చెప్పారంటే
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:06 PM
ఏపీ ఎన్నికల సంఘం(SEC) ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 13: రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశం నిర్వహించామని ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. రాష్ట్రంలోని 20 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గాను, ఒక్క పార్టీ మినహా మిగతా 19 పార్టీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజయరయ్యారని చెప్పారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాలని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపిన తరువాతే నోటిఫికేషన్ గురించి ఆలోచిస్తామని తెలిపారు. కుల ధృవీకరణ పత్రాలు, నేటివిటీ (నివాస) సర్టిఫికెట్లను త్వరగా జారీ చేయాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేశాయన్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే మద్యం ప్రవాహాన్ని కంట్రోల్ చేయాలని ఎన్నికల సంఘానికి సూచించారని చెప్పారు.
పండుగ రోజులను బట్టి ఎన్నికల షెడ్యూల్ లేదా తేదీలను పరిశీలించాలని రాజకీయ పార్టీల కోరాయని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు, నామినేషన్ కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని అభ్యర్థన వచ్చిందన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు పకడ్బందీగా సీసీటీవీ (CCTV) కవరేజ్ ఏర్పాటు చేయాలని కోరారని అన్నారు.
సమస్యాత్మక, అతి సమస్యాత్మక, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారని అనిల్ చంద్ర తెలిపారు. రాజకీయ పార్టీలు ఇచ్చిన అన్ని సలహాలు, అభిప్రాయాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆన్‌లైన్‌లో నామినేషన్ పత్రాలను తీసుకోవాలంటూ రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తిని కన్సిడర్ చేస్తామని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీశైలంకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు.. తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం: గొట్టిపాటి
రాజమండ్రిలో కిడ్నాప్‌కు గురైన ఐదేళ్ల బాలుడు క్షేమం..
Read Latest AP News And Telugu News