ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్క్‌గా నామకరణం చేశాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:46 PM
నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్క్‌గా నామకరణం చేశామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును వర్చువల్‌గా పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు బైపాస్ రోడ్డుకు వాయుపుత్ర మార్క్‌గా నామకరణం చేశామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ఆత్మకూరులో నూతన బైపాస్ రోడ్డును వర్చువల్‌గా పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు. రూ.8.91 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు లైన్ల రహదారితో పట్టణ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు.
మంత్రి ఆనం చొరవతో ఈ బైపాస్ రోడ్డు అభివృద్ధి చెందింది..
మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చొరవతో ఈ బైపాస్ రోడ్డు అభివృద్ధి చెందిందని పవన్ కల్యాణ్ తెలిపారు. ముంబై జాతీయ రహదారి నుంచి ఆత్మకూరు పట్టణానికి బైపాస్ రోడ్డును అనుసంధానం చేస్తున్నామని వివరించారు. రెండున్నర కిలోమీటర్ల మేర బైపాస్ రహదారిని నిర్మిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
నెల్లూరు నగరాన్ని అత్యంత సుందరంగా మారుస్తాం: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
నెల్లూరు నగరాన్ని అత్యంత సుందరంగా మార్చాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నామని నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వ్యాఖ్యానించారు. మినీబైపాస్ రోడ్డులో ఐకానిక్ జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడారు. నుడా ఆధ్వర్యంలో 105 అడుగుల ఎత్తుండే అతిపొడవైన స్థంభంపై జాతీయ జెండాను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడమే తమ లక్ష్యమని కోటంరెడ్డి చెప్పారు. స్వాతంత్ర సమరయోధులు, దండి పోరాట యాత్రల చిత్రాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. నెల్లూరుకు మహానగరాల నుంచి యాత్రికులు వచ్చేంతగా సుందరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ‘ఐ లవ్ నెల్లూరు’.. అనే నినాదాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం
ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం
మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News