డీఎస్సీ-2008 నియామకాలపై హైకోర్టు తీర్పు.. మూడు పిటిషన్ల డిస్మిస్
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:16 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2008 ఉద్యోగాల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. జోవో నంబర్ 28ను ప్రభుత్వం సవరించిన విధానాన్ని తప్పుబడుతూ హైకోర్టులో మూడు పిటిషన్‌లు దాఖలయ్యాయి.
హైదరాబాద్, అక్టోబర్ 12: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2008 ఉద్యోగాల నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. జోవో నంబర్ 28ను ప్రభుత్వం సవరించిన విధానాన్ని తప్పుబడుతూ హైకోర్టులో డీఎస్సీ అభ్యర్థులు, బీఈడీ అభ్యర్థులు మూడు పిటిషన్‌లను దాఖలు చేశారు. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఈ మూడు పిటిషన్లను డిస్మిస్ చేస్తూ తీర్పు ఇచ్చింది.
2008 డిసెంబర్ నాటి అసలు నోటిఫికేషన్ ప్రకారమే DSC-2008 ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించాలని పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. మరోవైపు నోటిఫికేషన్ విడుదలైన తరువాత జీవో నంబర్ 28ను జారీ చేసి రూల్ 7కు ప్రొవిజన్ జోడించడం సరైంది కాదని బీఈడీ అభ్యర్థులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియాకాలను కొనసాగించాయని, ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు కూడా ఇచ్చాయని.. ఈ పరిస్థితుల్లో జీవో నంబర్ 28ను సవరించడం అంశంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేస్తూ.. మూడు రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి...
15 రోజుల్లో కారుణ్య నియామకాలు’.. సింగరేణి కార్మికులకు భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్
రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారు: సబితా ఇంద్రారెడ్డి
Read Latest Telangana News And Telugu News