Share News

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం

ABN , Publish Date - Oct 13 , 2026 | 12:34 PM

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.

తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం
Komatireddy Venkat Reddy Meets Nitin Gadkari

ఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో (Nitin Gadkari) తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) ఈరోజు (మంగళవారం) ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. తెలంగాణలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై మాట్లాడారు. ఎల్బీనగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు కేంద్రమంత్రి ఆమోదం తెలిపారు. కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన ప్రతిపాదనకు కేంద్రమంత్రి ఆమోదం తెలిపారు.


ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణంతో NH 167kపై తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అనుసంధానం జరిగితే, రవాణా వ్యవస్థ, పర్యాటకం మెరుగుపడనుందని కోమటిరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ - శ్రీశైలం NH 765పై ఎలివేటెడ్ కారిడార్‌ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంపై నూతన డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులకు కేంద్రమంత్రి ఆదేశించారు. పర్వతమాల పథకం ద్వారా తెలంగాణకు 5 రోప్‌వేలకు నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.


హైదరాబాద్ - అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవేపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. సేతు బంధన్ పథకం ద్వారా 3 ఆర్ఓబీలకు నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు. తెలంగాణలో 34 పనులకు సీఆర్ఐఎఫ్ (CRIF) నిధులను మంజూరు చేయాలని కోమటిరెడ్డి కోరగా కేంద్ర అధికారులను నితిన్ గడ్కరీ ఆదేశించారు. పుల్లూరు - అలంపూర్ - జట్రపోలు - పెంట్లవెల్లి - కొల్లాపూర్ - లింగాల - అచ్చంపేట - డిండి - దేవరకొండ - మల్లేపల్లి - నల్గొండ రాష్ట్ర హైవేలను జాతీయ హైవేలుగా మార్చాలని కోమటిరెడ్డి కోరడంతో సానుకూలంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం

ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం

మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 01:12 PM