Share News

వికాస్ మర్మత్‌పై క్రిమినల్ కేసు.. నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించిన ఏపీ సీఎం

ABN , Publish Date - Oct 13 , 2026 | 03:02 PM

బెంగుళూరు పోలీసులతో ఏపీ కేడర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌ ఘర్షణ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం వికాస్ మర్శత్ ఘర్షణ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది.

వికాస్ మర్మత్‌పై క్రిమినల్ కేసు.. నివేదిక ఇవ్వాలని సీఎస్‌ను ఆదేశించిన ఏపీ సీఎం

అమరావతి, అక్టోబర్13: బెంగుళూరు పోలీసులతో ఏపీ కేడర్ ఐఏఎస్ వికాస్ మర్మత్‌ ఘర్షణ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం వికాస్ మర్శత్ ఘర్షణ వ్యవహారం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని సీఎస్‌కు సీఎం స్పష్టం చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్ ఏపీ కేడర్ అధికారి వికాస్ మర్మత్. ప్రస్తుతం సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు.


2026, అక్టోబర్ 10వ తేదీ అర్ధరాత్రి బెంగళూరులోని పబ్‌లో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వయస్సు ధ్రువీకరణ కోసం కస్టమర్ల గుర్తింపు కార్డులను వారు తనిఖీ చేశారు. వికాస్ మర్మత్‌తోపాటు అతడి స్నేహితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వికాస్ మర్మత్‌తోపాటు అతడి స్నేహితులపై కబ్బన్ పార్క్ పీఎస్‌లో పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో ఈ ఘటనపై నివేదిక అందజేయాలని సీఎస్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారు: సబితా ఇంద్రారెడ్డి

హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

For More AP News And Telugu News

Updated Date - Oct 13 , 2026 | 03:48 PM