హాస్టళ్ల టెండర్లలో రూ.66 కోట్ల గుడ్‌విల్?.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్‌రావు సంచలన ఆరోపణలు
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:22 PM
అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని సూచించారు.
హైదరాబాద్, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అవినీతిమయమైన పీఎంయూ కేంద్రీకృత టెండర్లను వెంటనే రద్దు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. పాత పద్ధతిలోనే స్థానిక వెండర్ల ద్వారా ప్రభుత్వ హాస్టళ్లకు సరుకులు సరఫరా చేయాలని సూచించారు. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో సరుకుల సరఫరా కోసం తెచ్చిన కేంద్రీకృత పీఎంయూ టెండర్లను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని పట్టుబట్టారు. గతంలో మాదిరిగానే పాఠశాలను ఒక యూనిట్‌గా తీసుకుని, డిస్ట్రిక్ట్ పర్చేస్ కమిటీ (DPC) ద్వారా స్థానిక వెండర్లకే నిత్యావసర సరుకుల సరఫరా బాధ్యతలు అప్పగించాలని సూచించారు.
విద్యార్థుల కడుపు కొడుతున్నారు..
పాత విధానాన్ని కొనసాగించడం ద్వారా జీవనోపాధి కోల్పోతున్న వేలాదిమంది చిరు వ్యాపార కుటుంబాల భవిష్యత్తును కాపాడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన, తాజా సరుకులు అందుతాయని హరీశ్‌రావు వెల్లడించారు. ప్రభుత్వ పెద్దల కమీషన్ల కోసం బ్లాక్‌లిస్ట్ సంస్థకు టెండర్ కట్టబెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టులు ఇస్తూ జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున రూ.66 కోట్ల గుడ్‌విల్, బిల్లుల్లో ప్రతినెల 20 శాతం కమీషన్లు నొక్కేస్తూ పేద విద్యార్థుల కడుపు కొడుతున్నారని ఆగ్రహించారు.
పాత విధానాన్ని పునరుద్ధరించాలి..
లోకల్ వెండర్లు ఇచ్చే ధరల కంటే 35 నుంచి 45 శాతం అధిక ధరకు కాంట్రాక్ట్ ఖరారు చేసినా.. నేటికీ హాస్టళ్లకు సరుకులు ఇవ్వలేని చేతకానితనం కాంగ్రెస్ సర్కార్‌దని హరీశ్‌రావు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన మూడు నెలల్లోనే విఫలమై రద్దయిన విధానాన్ని.. ఎవరి స్వలాభం కోసం తెలంగాణలో రుద్దుతున్నారు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ టెండర్లను రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్ధరించకపోతే, బాధిత కుటుంబాలు, విద్యార్థుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్దఎత్తున పోరాడుతామని హరీశ్‌రావు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎన్నికల్లో ఓటమి భయంతోనే మోదీ సర్కార్ ‘సర్’ ను అమలు చేస్తోంది.. సీఎం ధ్వజం
ఖమ్మం జిల్లాలో నేత్రపర్వంగా శ్రీవారి ఆలయ భూమిపూజ మహోత్సవం
మోదీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోంది: మంత్రి ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News