Share News

విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:37 AM

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మంగళవారం పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం విజయ్ స్వయంగా అల్పాహారం వడ్డించారు.

విద్యార్థులకు ఉచిత అల్పాహార పథకాన్ని ప్రారంభించిన సీఎం విజయ్..
Tamil Nadu Breakfast Scheme

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఇవాళ (మంగళవారం) పాఠశాల విద్యార్థుల కోసం విస్తరించిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. చెన్నైలోని గాంధీ గ్రామం ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలో ఈ పథకానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సీఎం విజయ్ స్వయంగా అల్పాహారం వడ్డించారు. అనంతరం వారితో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ తర్వాత తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు.


కాగా, గత ప్రభుత్వం అమలు చేసిన ముఖ్యమంత్రి అల్పాహార పథకంలో టీవీకే ప్రభుత్వం పలు మార్పులు చేసింది. ఈ పథకానికి పెరుంతలైవర్ కామరాజర్ ఉచిత అల్పాహార పథకంగా పేరు మార్చింది. ఇప్పటివరకు 5వ తరగతి వరకు అమలైన ఈ పథకాన్ని తాజాగా 8వ తరగతి వరకు విస్తరించింది. ఈ మేరకు విస్తరించిన పథకాన్ని సీఎం విజయ్ నేడు ప్రారంభించారు. ఈ విస్తరణతో అదనంగా సుమారు 15.30 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,454 ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ పాఠశాలల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.


ఈ కారణంగా ప్రభుత్వంపై ఈ ఏడాది రూ.217.63 కోట్ల అదనపు భారం పడనుంది. దీంతో ఈ సంవత్సరం అల్పాహార పథకానికి ప్రభుత్వం కేటాయించిన మొత్తం నిధులు రూ.724 కోట్లకు చేరాయి. విద్యార్థులకు పోషకాహారం అందించడం, వారు ఆకలితో పాఠశాలకు రాకుండా చూడటం, వారి ఆరోగ్యం, విద్యాభ్యాసానికి తోడ్పడటం ఈ పథకం ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వం తెలిపింది.


ఈ వార్తలు కూడా చదవండి

పార్కులో బాలికపై సామూహిక అత్యాచారం.. పోలీసులమని బెదిరిస్తూ..

లాల్‌బాగ్‌చా రాజాను దర్శించుకున్న బాలివుడ్ స్టార్ షారుక్ ఖాన్

Updated Date - Sep 22 , 2026 | 12:11 PM