Share News

భారత్‌కు భద్రతా మండలిలో సభ్యత్వం.. నాలుగు యూరప్ దేశాల మద్దతు..

ABN , Publish Date - Sep 22 , 2026 | 09:12 AM

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పలు యూరప్ దేశాల నుంచి మద్దతు లభించింది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మధ్య ఐరోపాకు చెందిన నాలుగు దేశాలు మద్దతును ప్రకటించాయి.

భారత్‌కు భద్రతా మండలిలో సభ్యత్వం.. నాలుగు యూరప్ దేశాల మద్దతు..
India UNSC permanent seat

ఇంటర్నెట్ డెస్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు పలు యూరప్ దేశాల నుంచి మద్దతు లభించింది. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్‌కు మధ్య ఐరోపాకు చెందిన నాలుగు దేశాలు మద్దతును ప్రకటించాయి. హంగేరీ, పోలాండ్, స్లోవేకియా, చెక్ రిపబ్లిక్ దేశాలతో కూడిన విసెగ్రాడ్ గ్రూప్‌ (V4) భారత్‌కు మద్దతుగా నిలిచింది (India UNSC permanent seat).


న్యూయార్క్‌లో జరుగుతున్న 81వ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా తొలి వీ4-భారత్ విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో భేటీ అనంతరం స్లోవేకియా విదేశాంగ మంత్రి జురాజ్ బ్లానార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దక్షిణ దేశాల్లో భాగమైన భారత్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న అగ్రశక్తి అని, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యదేశంగా ఉండాల్సిందేనని వీ4 దేశాలన్నీ ఏకాభిప్రాయంతో ఉన్నాయని ఆయన తెలిపారు (India V4 countries).


భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది (India global superpower). ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో భారీ మార్పులు వచ్చినప్పటికీ.. 1945లో ఏర్పడిన భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ నిర్మాణంలో పెద్దగా మార్పులు రాలేదని భారత్ వాదిస్తోంది. భారత్ శాశ్వత సభ్యత్వ ప్రతిపాదనకు ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా, రష్యా సహా పలు దేశాలు మద్దతు తెలిపాయి. ఇక, జీ4 కూటమిలోని బ్రెజిల్, జర్మనీ, జపాన్‌లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం పరస్పరం మద్దతు ఇచ్చుకుంటున్నాయి. అయితే చైనా నుంచి మాత్రం స్పష్టమైన మద్దతు రావడం లేదు.


ఇవి కూడా చదవండి..

ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..


మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Sep 22 , 2026 | 09:15 AM