Home » United Nations
కంచే చేను మేస్తే ఏంటి పరిస్థితి? ఇదే ఇప్పుడు ప్రపంచంలో మహిళలు, బాలికల స్థితి. ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం తాజాగా రిలీజ్ చేసిన రిపోర్టులో హృదయవిదారక విషయాలు వెలుగులోకి వచ్చాయి. డొమెస్టిక్ వయలెన్స్ ఎంత తీవ్రంగా ఉందో ఆ నివేదికలు బయటపెట్టాయి.
ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు లేక కార్యకలాపాలు స్తంభించే స్థితికి వచ్చాయని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ క్లిష్టసమయంలో సంస్థకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ప్రపంచ శాంతిని పరిరక్షించడంలో భారత సైనిక దళాలు ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి పంపించే శాంతి దళాల్లో ఎక్కువ మంది భారత సైనికులే కావడం విశేషం. 50కి పైగా మిషన్లకు 2,90,000 మందితో కూడిన..
ఐక్యరాజ్య సమితి వేదికగా తన ద్వంద్వ వైఖరిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసిన పాక్ ప్రధానికి భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ దుర్నీతిని భారత దౌత్య వేత్త పేటల్ ఎండగట్టారు. పాక్ శాంతిని కోరుకుంటే ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించి నిజాయతీ నిరూపించుకోవాలని అన్నారు.
ఏడాది క్రితం అమెరికా తీవ్ర చిక్కుల్లో ఉందనీ, తన హయాంలో కేవలం ఎనిమిది నెలల్లోనే ఎంతో మార్పు వచ్చిందని, ఇది తమదేశానికి స్వర్ణయుగమని ట్రంప్ అన్నారు. ఏ దేశం కూడా తమ దరిదాపుల్లోకి కూడా రాలేవన్నారు.
యుద్ధాలను ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఘోరంగా విఫలమైందని కూడా ట్రంప్ విమర్శించారు. యుద్ధాలను పరిష్కరించేందుకు కనీసం సహకరించే ప్రయత్నం కూడా చేయలేదని తప్పుపట్టారు. ఉత్తుత్తి మాటలు యుద్ధాలను పరిష్కరించ లేవన్నారు.
సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన ఆరోపణలను కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. ఈ విషయంలో పూర్తి బాధ్యత పాక్‌దేనని స్పష్టం చేశారు.
India slams Pakistan at UN: ఉగ్రవాదం అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్‌ను భారత్ తీవ్రంగా మందలించింది. 2008 ముంబై దాడులు, గత నెల పహల్గాంలో పర్యాటకుల హత్య చేసింది పాక్ ఉగ్రవాదులేనని విరుచుకుపడింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామమని పేర్కొంది.
పాకిస్థాన్‌ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తప్పుపట్టింది. పహల్గాం ఉగ్రదాడి, పాక్‌లోని ఉగ్రవాద సంస్థలపై మండలి కీలక ప్రశ్నలు అడిగింది, పాకిస్థాన్‌ను ఒంటరిగా ఉంచింది
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ప్రత్యేక ఆర్టికల్ 370ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. తద్వారా ఆ రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిందని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.